భారీ లాభాలతో ముగిసిన మార్కెట్‌: టాటా స్టీల్‌ జంప్‌ | Sakshi
Sakshi News home page

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్‌: టాటా స్టీల్‌ జంప్‌

Published Thu, May 26 2022 3:32 PM

Sensex gains 585 points Nifty above 16200 led by IT metal banks - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఫెడ్‌ రేట్ల పెంపు భారీగా ఉండక పోవచ్చనే అంచనాలతో  మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. 

ముఖ్యంగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. మిడ్‌ సెషన్‌ తరువాత సెన్సెక్స్‌ 500 పాయింట్లు ఎగిసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 584 పాయింట్ల నిఫ్టీ 176 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్‌ 503 పాయింట్ల లాభంతో 54,253 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు ఎగిసి 16170 వద్ద ముగిసింది.   ఫలితంగా సెన్సెక్స్‌ 54 వేలకు ఎగువన, నిఫ్టీ  16150కి  ఎగువన స్థిరపడింది. 

టాటా స్టీల్‌, జేఎస్‌ డబ్ల్యూ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్‌,  ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, హిందాల్కో టాప్‌ గెయినర్స్‌గా  ఉన్నాయి. మరోవైపు  యూపీఎల్‌, దివీస్‌,  ఐటీసీ, సన్‌ ఫార్మ, అదానీ పోర్ట్స్‌ నష్టపోయాయి.మార్చి 2022 త్రైమాసికంలో సంస్థ రూ. 118 కోట్ల నష్టాన్ని నివేదించినప్పటికీ, టోరెంట్ ఫార్మా షేర్లు  9 శాతం  ఎగిసింది. 

అటు డాలరు మారకంలో రూపాయి  గురువారంపాజిటివ్‌గా ముగిసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 3పైసలు ఎగిసి  77.54  వద్ద క్లోజ్‌ అయింది. 

Advertisement
Advertisement