రికార్డ్‌ ర్యాలీకి బ్రేక్‌, అదరగొట్టిన మారుతి సుజుకి

5 Jul, 2023 17:19 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు  స్వల్ప లాభాలతోనైనా పటిష్టంగానే ముగిసాయి.  నిఫ్టీ 50 వరుసగా ఐదవ రోజు రికార్డు స్థాయి సెషన్‌ను కొనసాగించింది.  10 పాయింట్ల లాభంతో 19,398.50 వద్ద  ముగియగా, సెన్సెక్స్  33 పాయింట్లు  క్షీణించి 65,446 వద్ద ముగిసింది.  ప్రాఫిట్-బుకింగ్ కారణంగా గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న ర్యాలీకి బ్రేక్‌  పడింది.  

బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్ల నష్టం పోయింది. సెన్సెక్స్‌లో    ఎంపీవీ ఇన్‌విక్టో లాంచ్‌ తరువాత మారుతీ సుజుకి షేర్లు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఫలితంగా  బీఎస్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (m-క్యాప్) తొలి సారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్లే టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా కన్జ్యూమర్‌, యూపీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు