ఆరంభ లాభాలు ఆవిరి: నైకా షేర్లు ఢమాల్‌ | Sakshi
Sakshi News home page

StockMarketClosing: ఆరంభ లాభాలు ఆవిరి, నైకా షేర్లు ఢమాల్‌

Published Tue, Oct 25 2022 3:46 PM

Sensex Nifty erase gains ended in red - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను వెంటనే కోల్పోయిన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌  కనిపించింది. దీంతో ఒక దశలో 60వేలను దాటేసిన సెన్సెక్స్‌ చివరికి 288  పాయింట్లు నష్టపోయి 59543 వద్ద,  నిఫ్టీ  74 పాయింట్ల నష్టంతో 17659 వద్ద స్థిరపడింది.  

అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలతో భారీ నష్టాలనుంచి సేచీలు కోలుకున్నాయి.  టెక్‌ మహీంద్ర, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ , ఐషర్‌ మోటార్స్‌ లాభపడగా,  నెస్లే, కోటక్‌ మహీంద్ర, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, బ్రిటానియా నష్టపోయాయి. అలాగే నైకాషేర్లు  2శాతం  పతనాన్ని నమోదు చేశాయి.   భారీ అమ్మకాలతో  ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా ఆరంభం లాభాలను కోల్పోయింది. తీవ్ర ఒడి దుడుకుల మధ్య  శుక్రవారం నాటి  82.68 ముగింపుతో పోలిస్తే  స్వల్ప నష్టాలతో 82.73 వద్ద ముగిసింది. 

Advertisement
Advertisement