గ్లోబల్‌గాప్రతికూల సంకేతాలున్నా, సెన్సెక్స్‌ 367 పాయింట్లు జంప్‌  | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌గా ప్రతికూల సంకేతాలున్నా, సెన్సెక్స్‌ 367 పాయింట్లు జంప్‌ 

Published Wed, Apr 5 2023 10:23 AM

Sensex surges 300 points Nifty above 17500 - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు న్నప్పటికీ దేశీయ సూచీలు  హుషారుగా ఉన్నాయి. సెన్సెక్స్‌ 367పాయింట్లు ఎగిసి 59476 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు 17501 వద్ద కొనసాగుతున్నాయి. 

ఫైనాన్షియల్ షేర్ల లాభాలు సూచీలకు మద్దతిస్తున్నాయి.  మరోవైపు ఐటీ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.  బజాజ్‌ ట్విన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్‌ భారీగా లాభపడుతుండగా, ఐషర్‌ మోటార్స్‌,హిందాల్కో, ఇండస్‌ ఇండ్‌బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  ప్రధాన నష్టాల్లో ఉన్నాయి.

మరోవైపు  ఎంఎన్‌సీ  రెండు రోజుల  సమావేశాలు  ప్రారంభమైన నేపథ్యంలో  ఆర్‌బీఐ  మానిటరీ పాలసీ నిర్ణయాలు రేపు వెలువడనున్నాయి.  ఈ సారి 25 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేపు పెంపు ఉంటుందని అంచనాలు భారీగా ఉన్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement