సెప్టెంబర్‌లో 12 బ్యాంక్‌ హాలీడేస్‌!

28 Aug, 2021 07:50 IST|Sakshi

Bank Holidays September 2021: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 క్లోజింగ్‌ డేస్‌ రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో దాదాపు ఎక్కువగా మిగతా రాష్ట్రాల పండుగలే ఉండడం విశేషం. 

సెప్టెంబర్‌ 8 తిథి ఆఫ్‌ శ్రీమంత శంకర్‌దేవ
సెప్టెంబర్‌ 9 తీజ్‌(హరిటలికా)
సెప్టెంబర్‌ 10 వినాయక చవితి
సెప్టెంబర్‌ 11 గణేశ్‌ చతుర్థి (2వరోజు)
సెప్టెంబర్‌ 17 కర్మ పూజ
సెప్టెంబర్‌ 20 ఇంద్రజాతర
సెప్టెంబర్‌ 21 శ్రీ నారాయణ గురు సమాధి డే

చదవండి: హ్యాండ్‌క్యాష్‌.. అయినా ఈఎంఐలే ఎందుకు?

పై లిస్ట్‌లో కేవలం వినాయక చవితి పండుగ నాడు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంక్‌ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తిథి ఆఫ్‌ శ్రీమంత శంకర్‌దేవకు గువాహటి, తీజ్‌ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్‌ 10న అగర్తల, ఐజ్వాల్‌, భోపాల్‌, డెహ్రాడూన్‌, ఐజ్వాల్‌, భోపాల్‌, చంఢీగఢ్‌, గ్యాంగ్‌టక్‌, ఇంఫాల్‌, జైపూర్‌, జమ్ము, కాన్పూర్‌, కోల్‌కతా, లక్నో, కొత్త ఢిల్లీ, పట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లా, శ్రీనగర్‌, తిరువనంతపురంలో తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితికి సెప్టెంబర్‌ 10న బ్యాంకులు మూతపడనున్నాయి. అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ గణేష్‌చతుర్థి మొదటి రోజుకు, పనాజీలో రెండో రోజుకు కూడా బ్యాంక్‌ సెలవులు తీసుకోనున్నాయి. కర్మపూజకుగానూ పనాజీ, ఏప్రిల్‌ 17న కర్మపూజలో భాగంగా రాంచీ, ఇంద్రజాతర కోసం గ్యాంగ్‌టక్‌, శ్రీ నారాయణ గురు సమాధి డే కొచ్చి-తిరువంతపురంలో బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. 

సెప్టెంబర్‌ 11 గణేశ్‌ చతుర్థి (2వరోజు) సెలవు.. రెండో శనివారం కారణంగా ఓవర్‌ లాప్స్‌ కానుంది. ఆర్బీఐ సాధారణంగా తన సెలవులను మూడు కేటగిరీలకు విభజిస్తుంది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌, హాలీడే అండర్‌  నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌, రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం బ్యాంకులకు సెలవుల్ని నిర్ధారిస్తుంది ఆర్బీఐ. 

సెప్టెంబర్ 5 – ఆదివారం, సెప్టెంబర్ 11 – రెండవ శనివారం, సెప్టెంబర్ 12 – ఆదివారం,  సెప్టెంబర్ 19 – ఆదివారం, సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం, సెప్టెంబర్ 26 – ఆదివారం.. బ్యాంకుల సాధారణ సెలవులు.

మరిన్ని వార్తలు