సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Thu, Jan 4 2024 4:17 PM

Stock Market Closing On Today - Sakshi

దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి 21,658 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 490 పాయింట్లు పుంజుకుని 71,847 వద్ద స్థిరపడింది.

గడిచిన ట్రేడింగ్‌ సెషన్‌లో ఐటీస్టాక్‌లు భారీగా కుంగిన విషయం తెలిసిందే. అయితే గురువారం మార్కెట్లో కొంత రేంజ్‌బౌండ్‌లోనే ఐటీ స్టాక్‌లు కదలాడాయి. రానున్న త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రావనే ఊహాగానాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇటీవల మార్కెట్‌లు భారీగా ర్యాలీ అవడంతో మదుపరులు కొంత లాభాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. బ్యాకింగ్‌ సూచీ రేంజ్‌బౌండ్‌లో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గురువారం బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 78.38 డాలర్ల వద్దకు చేరింది. ఎఫ్‌ఐఐలు బుధవారం రూ.666.34 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు సైతం రూ.862.98 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, నెస్లే, పవర్‌గ్రిడ్‌, ఇన్పోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభాల్లోకి చేరాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎం అండ్‌ ఎం, మారుతిసుజుకీ, హెచ్‌యూఎల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, విప్రో నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
Advertisement