Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Published Mon, Sep 27 2021 4:08 PM

Stock Market: Sensex, Nifty Ends Flat Amid Volatility - Sakshi

ముంబై: నేడు దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ వితకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. అయితే, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కాపేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంకా సెన్సెక్స్ 60000 పాయింట్లకు పైగానే ఉంది. నేటి ట్రేడింగ్‌లో ఒడుదొడుకులకు లోనైన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ ముగించాయి. ముగింపులో, సెన్సెక్స్ 29.41 పాయింట్లు(0.05%) పెరిగి 60077.88 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 1.90 పాయింట్లు (0.01%) పెరిగి 17855.10 వద్ద ముగిసింది. నేడు సుమారు 1592 షేర్లు అడ్వాన్స్ అయితే, 1682 షేర్లు క్షీణించాయి, 176 షేర్ల విలువ మారలేదు. (చదవండి: మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్‌!)

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు రూ.73.84 వద్ద ట్రేడవుతోంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఒఎన్‌జిసి మరియు హీరో మోటోకార్ప్ నిఫ్టీలో ఎక్కువ లాభాలను పొందితే.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, దివిస్ ల్యాబ్స్, విప్రో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు భారీగా నష్ట పోయాయి. 

Advertisement
Advertisement