Strom Motors R3 Three-Wheeler EV Price and Features - Sakshi
Sakshi News home page

ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్!

Published Fri, Apr 15 2022 7:54 PM

Strom R3 Three Wheel Electrict Vechile Car 200km Range - Sakshi

దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు డిమాండ్‌ భారీగా పెరిగిపోతుంది. నిన్నమొన్నటి దాకా అవేం బండ్లు అని కొట్టేసిన వాహనదారులు..ఇప్పుడు అవే కావాలని ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ షోరూం వైపు కన్నెత్తి చూడని వాళ్లు సైతం ఎలక్ట్రిక్‌ బైక్స్‌, కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ను కొనేకంటే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్థలు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. గతేడాది  ముంబైకి చెందిన ఆటోమొబైల్‌ సంస్థ స్ట్రోమ్‌ మోటార్స్‌ 'స్టోమ్‌ ఆర్‌3' పేరుతో కొత్త ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆ కారును కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు. 

ఆటో తరహాలో ఈ కారుకు ముందు రెండు టైర్లు.. వెనుక ఒక టైరు ఉండగా.. సీట్లు రెండే ఉన్నాయి. ఇక ఈ కారు 2,915ఎంఎం పొడవు 1,519 ఎంఎం, వెడల్ప్‌ 1,545 ఎత్తు ఉంటుంది. అచ్చం స్టోమ్‌ ఆర్‌3 కారు ముందు భాగం 'మహీంద్రా ఈ2ఓ'ను పోలి ఉంది. అయితే ఈ కారుకు టెక్నాలజీని జోడిస్తూ గ్రిల్‌ ఎలిమెంట్‌ను కారు ఎడమవైపు, కుడివైపు ఇలా బ్యానెట్‌ వరకు డిజైన్‌ చేశారు. ఇరువైపులా షట్కోణంలో డోర్స్‌ ఉన్నాయి.  

లగ్జరీ కార్లు ఫీచర్లు   
1990లలో మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లలో ఉండే ఈ లగ్జరీ స్క్రీన్‌ ఫీచర్లు..ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్‌ కార్లలో వస్తున్నాయి. ఇక ఈ కార్‌లో సైతం 3స్క్రీన్‌లు ఉండగా ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్‌లుగా ఉపయోగించుకోవచ్చు. అందులో ఒక స్క్రీన్‌ 7అంగుళాలు, మిగిలిన రెండు స్క్రీన్‌లలో ఒకటి 4.3 అంగుళాలు, మరో స్క్రీన్‌ 2.4 అంగుళాలుగా ఉంది. సెంట్రల్ కన్సోల్‌లో రెండు ఎయిర్‌కాన్ వెంట్‌(కారులో ఏసీ.లోపలి గాలి బయటకు..బయట గాలి లోపలికి వచ్చే) ఉంది. టూ టోన్ ఇంటీరియర్‌(కార్‌ టాప్‌, అండ్‌ బాడీ కలర్‌) తో బ్లాక్‌, లైట్‌ గ్రే కలర్స్‌ అందించబడుతుంది. 4జీ కనెక్టివిటీతో నావిగేషన్, వాయిస్ కంట్రోల్, సిగ్నల్‌ కంట్రోలింగ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. 

ఈ కారు బరువెంతో తెలుసా?
స్టీల్ స్పేస్ ఫ్రేమ్ ఆధారంగా కారు 550కిలోల బరువును తక్కువగా ఉండేలా డిజైన్‌ చేశారు. 15కేడబ్ల్యూ, 90ఎన్‌ఎం టార్క్ తో ఎలక్ట్రిక్ మోటారు, సింగిల్ రిడక్షన్ గేర్‌బాక్స్‌, స్ట్రోమ్ టాప్ స్పీడ్ 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయోచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే మూడు వేర్వేరు లి-అయాన్‌ బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లు 120,160,200 కిలోమీటర్ల రేంజ్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు ధర ఎక్స్‌ షోరూమ్‌ కారు ధర రూ.4.5లక్షలుగా ఉండగా..కారును మార్కెట్‌లో విడుదలైన 4రోజుల్లో సుమారు 160కార్లు బుక్కైనట్లు స్ట్రోమ్‌ మోటార్స్‌ ప్రతినిధులు వెల్లడించారు.

చదవండి: భారత్‌లో తొలి కియా ఎలక్ట్రిక్‌ కార్‌, స్టైలిష్‌ లుక్‌తో రెడీ ఫర్‌ రైడ్‌!

Advertisement
Advertisement