Sushma Boppana: ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ బోధన

19 Nov, 2021 04:19 IST|Sakshi

‘ఇన్ఫినిటీ లెర్న్‌’ సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన

Sushma Boppana About Infinity Learn: కోవిడ్‌ తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్‌లైన్‌ అభ్యసనానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీచైతన్య విద్యాసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇన్ఫినిటీ లెర్న్‌’ అనే ఎడ్యుటెక్‌ సంస్థను ప్రారంభించింది. నీట్, జేఈఈ విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా బోధనానునుభవంతో ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ‘ఇన్ఫినిటీ లెర్న్‌’ సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన పేర్కొంటున్నారు. ఈ  నేపథ్యంలో ‘ఇన్ఫినిటీ లెర్న్‌’ గురించి ఆమె మాటల్లోనే...

నాణ్యమైన కంటెంట్‌
ఇతర సంస్థలకు భిన్నంగా నాణ్యమైన కంటెంట్‌ అందించే ప్రధాన లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్‌’ను తీర్చిదిద్దాం. ఆఫ్‌లైన్‌లో బోధిస్తున్న విధానానికి దీటుగా డిజిటల్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించే ఏర్పాటు చేశాం. విద్యార్థులకు  కేవలం ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడం, హోమ్‌వర్క్‌లు కేటాయించడమే కాకుండా ఆ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. గత 36 ఏళ్లుగా శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా సాధించిన అనుభవం ఈ వ్యూహాలు అమలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి.  

నీట్, జేఈఈపై దృష్టి
మొదటగా నీట్, జేఈఈపై దృష్టి సారించాం. నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేరుతున్నారు. టెస్ట్‌ సిరీస్‌కూ ఆదరణ లభిస్తోంది. 2023 నాటికి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతోపాటు సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్, ఇంగ్లీషు లాంగ్వేజ్‌ పాఠాలు, కంప్యూటర్‌ కోర్సులు అందించే ఆలోచన ఉంది. 2024 నాటికి  శ్రీచైతన్య విద్యార్థులు కాకుండా మరో 10 లక్షల మంది విద్యార్థులు నేరుగా ‘ఇన్ఫినిటీ లెర్న్‌’ ప్రయోజనాలు పొందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ‘అమెజాన్‌ అకాడమీ’తోనూ ఒప్పందం కుదుర్చుకుని నీట్, జేఈఈ పరీక్షల పూర్తి కోర్సులను అందిస్తున్నాం. నీట్‌–2021లో రికార్డుస్థాయి ఫలితాలు సాధించాం. వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. 

 

ప్రణాళిక, పర్యవేక్షణ
ఇన్ఫినిటీ లెర్న్‌లో విద్యార్థి స్థాయికనుగుణంగా బోధన ఉంటుంది. అప్పుడే విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందనేది మా నమ్మకం. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్, ప్రాబ్లమ్‌ ఓరియెంటెడ్, న్యూమరికల్‌ అంశాలుగా విద్యార్థుల అవసరాల మేరకు  కంటెంట్‌ అందిస్తున్నాం. ఆన్‌ౖలñ న్‌లో విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకునే విధంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. తరగతిలో నేర్చుకున్న అంశాలను హోమ్‌ వర్క్‌ ద్వారా సాధన చేయడం, అందులో విద్యార్థులకు ఎదురైన అనుభవాలు, సందేహాలు నివేదికల రూపంలో అధ్యాపకుడికి చే రతాయి. వాటిని తర్వాత తరగతిలో ఉపాధ్యాయుడు విశ్లేషించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు అంశాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే వారు పరీక్షల్లోనూ రాణించగలుగుతారు.

టెక్నాలజీ వినియోగం
తరగతి గదిలో స్మార్ట్‌ బోర్డులను ఏర్పాటు చేసి ‘హైబ్రిడ్‌ ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ను రూపొందించాం. నీట్‌ లాంగ్‌టర్మ్‌ విద్యార్థులందరికీ దీన్ని అమలు చేస్తున్నాం. తద్వారా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరుస్తున్నాం. ఉపాధ్యాయ ఆధారిత బోధన కంటే విషయ ఆధారిత బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాం.  విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వినేటపుడు టెక్నాలజీ సమస్యలు తలెత్తకుండా అప్లికేషన్‌ తయారుచేశాం. పాఠాలు, స్టడీమెటీరియల్, యానిమేషన్‌ అంశాలను జోడించి బోధన సాగిస్తున్నాం.

స్కాలర్‌షిప్‌ టెస్ట్‌
శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించాం. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నిపుణులైన అధ్యాపకులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోలేనిచోట విద్యార్థులకు ప్రయోజనం కలగాలని భావించాం. నామమాత్రపు ధర నిర్ణయించి కోర్సులను అందిస్తున్నాం. రూ.99 నుంచి కోర్సు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ‘స్కోర్‌’ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ అందిస్తున్నాం.

మరిన్ని వార్తలు