ప్రభుత్వం మారితే.. విరామం సహజమే! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మారితే.. విరామం సహజమే!

Published Sat, Apr 6 2024 5:16 AM

Temporary stagnation if the government changes - Sakshi

విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు కొంత సమయం

ఎన్నికల తర్వాతే మార్కెట్‌లో రెట్టింపు

కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌తో ఇన్వెంటరీని పెంచొద్దు

పాత వాటిల్లో విక్రయాలు, నిర్మాణాల పూర్తిపై దృష్టిపెట్టాలి

బిల్డర్లతో బేరసారాలకు కస్టమర్లకు ఇదే సరైన సమయం

సాక్షి, హైదరాబాద్‌: ఎక్కడైనా సరే స్థిరాస్తి మార్కెట్‌లో ప్రభుత్వం మారితే విరామం సహజమే. బ్రేక్‌ తర్వాతే సినిమాలో అసలు కథ మొదలైనట్టే.. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లోనూ తాత్కాలిక స్తబ్ధత తర్వాతే రెట్టింపు వేగంతో పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు సమయం పడుతుందని అప్పటివరకు మార్కెట్‌ మందకొడిగా ఉండటం సాధారణమేనని అభిప్రాయపడ్డారు.

► అనుమతుల మంజూరులో కమిటీల నియామకం, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేర్పులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుంది ఇది సాధారణ ప్రక్రియే. దీంతో భూ లావాదేవీలలో స్తబ్ధత ఏర్పడుతుంది.  గత 4 ఏళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు అసహజంగా పెరిగిపోయాయి. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు, బడా వ్యాపారస్తుల భూముల కొనుగోళ్లు జరుపుతుంటారు. దీంతో సహజంగానే రేట్లు పెరుగుతాయి నగరంలో జరిగిందే.

కొత్త లాంచింగ్‌లొద్దు..
ప్రతికూల సమయంలో కొత్త ప్రాజెక్ట్‌లను లాంచింగ్‌ చేసి పరిశ్రమ మీద భారం వేయకూడదు. వచ్చే 1–2 ఏళ్ల పాటు కొత్త యూనిట్లను ప్రారంభించడం కంటే పాత ప్రాజెక్ట్‌లలో విక్రయాలు చేపట్టడం, నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మా ర్కెట్‌ పరిస్థితులు, ధోరణులను సమగ్రంగా అధ్య యనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృథా ఖర్చులు తగ్గించుకుంటూ నిర్మాణ పనులకే నిధులను కేటాయించాలి.  

కొనేముందు జాగ్రత్తలివే..
► రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తి, తక్కువ ధరకే ఫ్లాట్లను ఇస్తామని మాయ మాట లు చెప్పే డెవలపర్లకు దూరంగా ఉంటే బెటర్‌.
► అప్పటికప్పుడే నిర్ణయాలుకాకుండా 2–3 నెల లు ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించాలి.  
► ప్రతికూల సమయంలోనూ గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసే ఆరి్ధక స్థోమత ఉన్న బిల్డర్ల వద్ద కొనుగోలు చేయడమే సురక్షితం.
► అన్ని అనుమతులతో పాటు మార్కెట్‌లో పేరున్న నిర్మాణ సంస్థలోనే కొనడం ఉత్తమం.


ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవివే..
► 111 జీ.ఓ రద్దు చేశారు కానీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. జోన్ల కేటాయింపు, నిర్మాణ పనులకు అనుమతి తదితరాలపై క్లారిటీ ఇవ్వాలి. మాస్టర్‌ ప్లాన్‌లో భూ వినియోగ మార్పు చాలా క్లిష్టతరంగా మారింది. బిల్డర్లకే కాదు సామాన్యులకు సైతం భూ మార్పిడి చేసుకునేందుకు వీలుండే విధంగా ప్రక్రియను సులభతరం చేయాలి.
► ధరణి లోటుపాట్లపై కమిటీ సమరి్పంచిన నివేదికను సాధ్యమైనంత తర్వగా అమలు చేయాలి. పర్యావరణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి.


బేరసారాలకు ఇదే సమయం
భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్థిరాస్తి పెట్టుబడులలో సింహభాగం వాటా తెలుగు ప్రజలవే ఉంటాయని ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కుమార్‌ కామరాజు తెలిపారు. హైదరాబాద్‌ స్థిరమైన నగరం కావడంతో పాటు అధిక ఆదాయం, ఉద్యోగ కల్పన, మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థిర నివాసానికి మొగ్గు చూపిస్తుంటారన్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో మార్కెట్‌ స్తబ్దుగానే ఉంటుంది. అయితే వాస్తవానికి నిజమైన కొనుగోలుదారులకు గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. ఎందుకంటే విక్రయాలు మందకొడిగా సాగే ఈసమయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. రోజువారి కార్యకలాపాలు, నిర్మాణ పనులకు అవసరమైన వ్యయం కోసం రేటు కాస్త అటుఇటైనా డెవలపర్‌ ఒక మెట్టు దిగే ఛాన్స్‌ ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement