ఎలన్‌ మస్క్‌కు కొత్త చిక్కులు..! ‘టెస్లాను వెంటనే మూసేయండి..!’ అంటూ.. | Sakshi
Sakshi News home page

Elon Musk: ఎలన్‌ మస్క్‌కు కొత్త చిక్కులు..! ‘టెస్లాను వెంటనే మూసేయండి..!’ అంటూ..

Published Tue, Jan 4 2022 6:31 PM

Tesla Criticised for Opening Showroom in China Xinjiang Region - Sakshi

ప్రముఖ అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లాపై పలువురు తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నారు. చైనాలోని వివాదాస్పద ప్రాంతంలో టెస్లా కంపెనీ షోరూమ్‌ను ఏర్పాటుచేసినందుకుగాను టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ను కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్కడ వెంటనే షోరూమ్‌ను మూసివేసియాలని విమర్శకులు కోరుతున్నారు.  

జిన్‌జియాంగ్‌లో టెస్లా షోరూమ్‌..!
కొద్ది రోజుల క్రితం చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉరుమ్‌కిలో షోరూమ్‌ను ప్రారంభిస్తోన్నట్లు టెస్లా గత శుక్రవారం విబోలో వెల్లడించింది. దీనిపై యూఎస్‌ వాణిజ్య సంస్థలు, అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఎలన్‌ మస్క్‌పై తీవ్రంగా విమర్శించారు. వారితో పాటుగా  యూఎస్‌ ట్రేడ్ గ్రూప్, అలయన్స్ ఫర్ అమెరికన్ మాన్యుఫ్యాక్చరింగ్, సెనేటర్ మార్కో రూబియో కూడా ఎలన్‌ మస్క్‌ విమర్శలను గుప్పించారు. కాగా ఈ వ్యవహారంపై టెస్లా ఇప్పటివరకు స్పందించలేదు.

కారణం ఇదే..
ఇటీవలకాలంలో చైనాలోని జిన్‌ జియాంగ్‌ ప్రాంతంపై అక్కడి ప్రభుత్వం అవలంభిస్తోన్న ధోరణిని ఖండిస్తూ వెస్ట్రన్‌ దేశాలు భారీ ఎత్తున్న విమర్శలను చేశాయి. దీనికి కారణం జిన్‌జియాంగ్‌లో ఉయ్ఘర్‌లు, మైనారిటీలను అక్కడి ప్రభుత్వం  నిర్భంధిస్తూ, వారిపై క్రూరంగా ప్రవర్తిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సమాజం చైనాపై  తీవ్ర విమర్శలను చేసింది.   

ఒలింపిక్స్‌ బహిష్కరణ..!
జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఆయా ప్రజలపై చైనా ప్రభుత్వం ప్రవర్తిస్తోన్న తీరుపై పలుదేశాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో పాటుగా మరికొన్ని దేశాలు ఫిబ్రవరిలో జరిగే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని ప్లాన్‌ చేశాయి. కాగా ఆయా దేశాలు చేసిన ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది.

చదవండి: భారత్‌ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్‌ మస్క్‌ కంపెనీ..!

Advertisement
Advertisement