Sakshi News home page

Aadhaar-PAN Link: ఈ రోజే లాస్ట్.. ఆధార్ - పాన్ లింక్ చేయకుంటే ఏమవుతుంది!

Published Fri, Jun 30 2023 6:49 PM

Today is the last date of the pan aadhaar link - Sakshi

PAN-Aadhaar Linking: పాన్ - ఆధార్ లింక్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లింకింగ్ గడువు ఈ రోజు కొన్ని గంటలలో ముగియనుంది. రేపటి నుంచి (జులై 01) ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. గతంలో దీని కోసం అనేక మార్లు గడువు పెంచడం కూడా జరిగింది. మరో సారి పొడిగిస్తుందో.. లేదో ప్రస్తుతానికి తెలియదు.

నిజానికి పాన్‌ - ఆధార్‌ లింక్‌ గడువు ఎప్పుడో ముగిసింది. అయితే 2023 మార్చి 31 వరకు రూ. 1000 ఫైన్‌తో అదనపు గడువు కల్పించారు. ఆ కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఆ గడువు కాస్త ఈ రోజుతో ముగియనుంది. ఇంకో సారి పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నా.. దీనిపైనా ఎటువంటి స్పష్టత లేదు.

ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది..
ఆధార్ - పాన్ గడువు లోపలు చేయకుండా ఉంటే వారి బ్యాంకింగ్ సర్వీసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం మాత్రమే కాకుండా.. ఆన్‌లైన్‌ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు, పెండింగ్‌ రిటర్నుల ప్రాసెస్‌ కూడా నిలిచిపోతుంది.

(ఇదీ చదవండి: మీ పాన్‌ నెంబర్‌తో ఆధార్‌ లింక్‌ అయిందా? ఈ సింపుల్‌ టెక్నిక్స్‌తో తెలుసుకోండి)

ఆధార్ - పాన్ లింక్ అనేది కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు & భారత పౌరులు కాని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఆధార్ - పాన్ లింక్ అవసరం లేదు.

Advertisement

What’s your opinion

Advertisement