సాక్షి మనీ మంత్రా: లాభాల ప్రారంభం, రికార్డ్‌ స్థాయికి దలాల్‌ స్ట్రీట్‌

17 Jul, 2023 09:14 IST|Sakshi

రికార్డ్‌ హైకి స్టాక్‌మార్కెట్‌

66630 స్థాయిని టన్‌ చేసిన సెన్సెక్స్‌  

ఆల్‌టైం హై స్థాయి 19600 ఎగువకు చేరిన నిఫ్టీ

Today Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం ఆరంభంలో లాభాలతొ మొదలైనాయి.​ కానీ గ్లోబల్‌ సంకేతాలతో సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌  25  పాయింట్ల లాభంతో 66091 నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 19590 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందనే అంచనాలతో ట్రేడర్ల అప్రమత్తంగా వ్యవహరించే చాన్స్‌ ఉంది.  ప్రస్తుతం  సెన్సెక్స్‌ 200  పాయింట్లకు పైగా లాభాలతో, నిఫ్టీ 41  పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. 

అయితే ఫలితాలు, నిపుణుల వ్యాఖ్యలు నిరాశాజనకంగా ఉనప్పటికీ ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. ఈ నెలలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 5 శాతం ఎగిసింది. టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎల్‌టీఐ  మైండ్‌ట్రీ  ఎక్కువగా లాభ పడుతుండగా  హెచ్‌డీఎఫ్‌సీ,  పవర్‌ గ్రిట్‌, ఎం అండ్‌ ఎం, పవర్‌ గ్రిడ్‌, నష్టపోతున్నాయి. దీనికి తోడు మరిన్ని కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ  ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా నిఫ్టీ 50, సెన్సెక్స్‌లు శుక్రవారం రికార్డు స్థాయిలో ముగిసిన సంగతి తెలిసిందే..

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు

ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి

మరిన్ని వార్తలు