సాక్షి మనీ మంత్రా: రికార్డ్‌ ముగింపు! 20,100 ఎగువకు నిఫ్టీ..

14 Sep, 2023 15:47 IST|Sakshi

Today StockMarket closing: దలాల్‌స్ట్రీట్‌లో బుల్‌ పరుగులు కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తూ సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 67,543 వద్ద ముగియగా, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 20,102 వద్ద ముగిసింది. క్రితం రోజు ఆల్‌టైమ్‌ హై 20,000 పాయింట్లను దాటిన నిఫ్టీ ఈరోజు మరింత ఎగబాకి 20,100 పాయింట్లను దాటి రికార్డ్‌ సృష్టించింది.

యూపీఎల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, దివిస్‌ ల్యాబ్స్‌, మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీల షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ఇండియా, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బ్రిటానియా సంస్థల నష్టాలను మూటగట్టుకుని లాప్‌ లూజర్స్‌ జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు