అదిరిపోయిన టోర్క్ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా ఎక్కువే! | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన టోర్క్ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా ఎక్కువే!

Published Sun, Dec 26 2021 8:53 PM

Tork T6X Electric Motorcycle Ready For Launch in 2022 - Sakshi

పూణేకు చెందిన టోర్క్ మోటార్స్ 2017లో భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించింది. కానీ, ఇప్పటికీ కంపెనీ తన అనుకున్న సమాయని కంటే చాలా వెనుకబడి ఉంది. టీ6ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ టెస్ట్ ఫోటోలు మాత్రమే బయటకి వచ్చాయి. ఇటీవల అప్‌డేట్లో టోర్క్ టీ6ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ రేంజ్ టెస్టింగ్ కోసం రోడ్డు మీదకు వచ్చింది. చివరిసారిగా టీ6ఎక్స్ మార్చి 2020లో దీనిని టెస్ట్ చేశారు. ఈ బైక్ డిజైన్ ఇంతకు ముందు వచ్చిన ఫోటోలతో పోలిస్తే భిన్నంగా ఉంది.

దీనిన్ హెడ్ ల్యాంప్ అనేది త్రిభుజాకారంలో ఉండి పల్సర్ ఎన్ఎస్ 200 తరహాలో కనిపిస్తుంది. ఈ బైక్ మధ్య భాగంలో ఫ్యూయల్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. ఈ బైక్ చూడాటానికి అచ్చం పెట్రోల్ బైక్ మాదిరిగానే కనిపిస్తుంది. టార్క్‌ మోటార్‌ సైకిల్స్‌ నుంచి త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ “టీ6ఎక్స్‌'లో ఎన్నో అడ్వాన్స్‌ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడి లైటింగ్, పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ జీపీఎస్‌, నేవిగేషన్‌ ఫీచర్లతో పాటు క్లౌడ్‌ కనెక్టివిటీ కూడా ఉంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. మంచి బ్యాకప్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీతో పాటు పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌ కూడా దీని సొంతం. ఈ బైక్ ఆక్సియల్ ఫ్లక్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ బైక్‌ స్పెషాలిటీ. దీని ధర రూ. 1.25 లక్షలుగా ఉండవచ్చు. ఈ బైక్ వచ్చే ఏడాది 2 వ త్రైమాసికంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

(చదవండి: చైనాకు భారత్ మరో భారీ షాక్.. ఆ ఉత్పత్తులపై ఐదేళ్లపాటు..!)

Advertisement
Advertisement