దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!

29 Jun, 2023 18:06 IST|Sakshi

Traya Founders Success Story: ఉన్నత చదువులు చదివి సంపన్నులైన వ్యక్తుల గురించి, విదేశాలను వదిలి ఇండియా వచ్చి బాగా సంపాదించిన వ్యక్తులను గురించి మనం గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నిజ జీవితంలో ఎదురైన సమస్యలను ఎదుర్కొని.. అలాంటి సమస్యలతో బాధపడేవారికి పరిష్కారం అందించడానికి మొదలెట్టిన వ్యాపారం వారిని కుబేరులను చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

త్రయ (Traya) సంస్థ ద్వారా సక్సెస్ సాధించిన 'సలోని ఆనంద్' & ఆమె భర్త 'అల్తాఫ్ సయ్యద్' ఇద్దరూ జుట్టు రాలడం సమస్యతో బాధపడ్డారు. అయితే ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా సంపూర్ణ జుట్టు సంరక్షణ చేయాలని ఆలోచించి బిజినెస్ ప్రారంభించారు.

త్రయ సంస్థ
నిజానికి జుట్టు రాలడానికి ప్రధాన కారణం నీటి సమస్య, వాతావరణ కాలుష్యం మాత్రమే కాదు. శరీరంలో జరిగే కొన్ని అంతర్లీన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయని గ్రహించి 2019లో త్రయను ప్రారంభించి, ఆయుర్వేద విధానంలో కారణాలను అన్వేషించి, మూలాలలో ఉండే సమస్యలను రూపుమాపడానికి ఉత్పత్తులు ప్రవేశపెట్టారు. 

(ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..)

నిజానికి సలోని ఆనంద్ మొదటిసారిగా అల్తాఫ్‌ను హైదరాబాద్‌లో కలుసుకుంది. ఆ తరువాత 2017లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సొంతంగా కంపెనీ ప్రారంభించడానికి ముందు హెల్త్‌కేర్ సంస్థ కాస్ట్‌లైట్‌లో మూడేళ్లపాటు పనిచేసింది సలోని. అప్పటికే మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా కూడా పొందింది.

(ఇదీ చదవండి: రూ. కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే!)

ఇక అల్తాఫ్ విషయానికి వస్తే.. కంపెనీ ప్రారంభించడానికి ముందు ఫుడ్ డెలివరీ స్టార్ట్-అప్ బిల్ట్2కూక్ నడిపాడు. అంతేకంటే ముందు ఇతడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ, గ్లాస్గో యూనివర్శిటీలో మెడికల్ బయోకెమిస్ట్రీలో సైన్స్ చదివాడు. సలోని ఆనంద్‌ పెళ్లి చేసుకున్న తరువాత త్రయ కంపెనీ స్థాపించి కోట్లు సంపాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు