వాట్సప్‌, టెలిగ్రామ్‌ బాటలోనే ట్రూకాలర్‌.. కొత్త ఫీచర్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

TrueCaller Web: వెబ్‌ వెర్షన్‌ లాంచ్‌ చేసిన ట్రూకాలర్‌

Published Thu, Apr 11 2024 9:10 AM

True Caller Releases Web Version As Same As WhatsApp And Telegram - Sakshi

ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి ఏదైనా కాల్‌ వస్తే వెంటనే దానికి సంబంధించిన వివరాలు మొబైల్‌లో డిస్‌ప్లే అవ్వడానికి ట్రూకాలర్‌ వినియోగిస్తుంటారు. తన వినియోగదారులకు మరింత సేవలందించేందుకు ట్రూకాలర్‌ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌వెబ్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ మాదిరిగానే ‘ట్రూకాలర్‌ వెబ్‌’ వెర్షన్‌ను ప్రారంభించింది. 

ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కాంటాక్ట్‌లిస్ట్‌లో లేని మొబైల్‌ నంబర్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఎస్‌ఎంఎస్‌, ఛాట్‌ మిర్రరింగ్‌, కాల్‌నోటిఫికేషన్‌ ఫీచర్లు కూడా వెబ్‌ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకసారి లింక్‌ చేసిన డివైజ్‌ డీలింక్‌ చేయకపోతే 30 రోజుల్లో ఆటోమెటిక్‌గా సైన్‌అవుట్‌ అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వినియోదారులకే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: సెలబ్రిటీలు ఇన్వెస్ట్‌ చేసిన యూనికార్న్‌లు ఇవే..

ఎలా కనెక్ట్‌ చేయాలంటే..
డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి వాట్సప్‌వెబ్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ లాగే ట్రూకాలర్‌వెబ్‌ అని టైప్‌చేయాలి. లింక్‌డిబైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసిన వెంటన్‌ వేరే పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఏ మొబైల్‌ తరఫున లాగిన్‌ చేయాలో ఆ ఫోన్‌ ఆన్‌చేసి ట్రూకాలర్‌ యాప్‌లోకి వెళ్లాలి. అందులో మెసేజెస్‌ విభాగంలో త్రిడాట్‌ మెను ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయాలి. అందులో ‘ట్రూకాలర్‌ ఫర్‌ వెబ్‌’పై ప్రెస్‌ చేయాలి. లింక్‌ డివైజ్‌ అనే అప్షన్‌ కనిపిస్తుంది. దాని ద్వారా డెస్క్‌టాప్‌పై కనిపిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. క్షణాల్లో ఫోన్‌ యాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌తో లింక్‌ అవుతుంది.

Advertisement
Advertisement