ఉడాన్‌ మెగా భారత్‌ సేల్‌

9 Aug, 2021 03:29 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బిజినెస్‌ టు బిజినెస్‌ ఆన్‌లైన్‌ వేదిక ఉడాన్‌ మెగా భారత్‌ సేల్‌ ప్రకటించింది. ఆగస్టు 14 వరకు ఇది కొనసాగనుంది. ఎఫ్‌ఎంసీజీ, ఆహారోత్తుల విభాగంలో చిన్న వర్తకుల కోసం భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్‌ సేల్, ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ డిస్కౌంట్స్, బై వన్‌ గెట్‌ వన్‌తోపాటు ఇతర ఆఫర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. 5 లక్షల పైచిలుకు వర్తకులకు ఈ భారీ అమ్మకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. వివిధ వ్యాపార విభాగాల్లో గడిచిన 18 నెలల్లో రూ.4,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు చేసినట్టు ఉడాన్‌ వెల్లడించింది

మరిన్ని వార్తలు