ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత

8 Aug, 2021 15:36 IST|Sakshi

మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురుంచి తప్పక తెలుసుకోండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) ఇక నుంచి ఎలాంటి ఆధారాలు/రుజువు లేకుండా చిరునామాను అప్ డేట్ చేయడం సాధ్యపడదు అని ట్విటర్ లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు బదులు ఇచ్చింది. యుఐడిఎఐ చేసిన ట్వీట్ ప్రకారం అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసింది. యూజర్ అహ్మద్ మెమోన్ చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ యుఐడిఎఐ జూన్ 14న ఇలా ట్వీట్ చేసింది.. "‎ప్రియమైన రెసిడెంట్, తదుపరి నోటీసు వచ్చేవరకు అడ్రస్ వాలిడేషన్ లేటర్ సదుపాయం నిలిపివేయబడింది. ఈ జాబితాలో చెల్లుబాటు అయ్యే PAA డాక్యుమెంట్ ఉపయోగించి దయచేసి మీ చిరునామా అప్ డేట్ ని చేసుకోవచ్చు" ‎అని ట్వీట్ లో పేర్కొంది.

ఆన్‌లైన్‌ లో ఆధార్ కార్డు చిరునామాను మార్చుకోండి ఇలా?

  • ఆధార్ అడ్రస్ అప్డేట్ పోర్టల్ ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయండి
  • 'Proceed to Update Aadhaar' మీద క్లిక్ చేయండి
  • 12 అంకెల యుఐడి నెంబరు నమోదు చేయండి
  • సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ నమోదు చేయండి
  • 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేయండి
  • మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటిపి వస్తుంది
  • రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి 'లాగిన్' మీద క్లిక్ చేయండి
  • మీ ఆధార్ వివరాలు చూపిస్తుంది. చిరునామాను మార్చండి, అలాగే చిరునామా రుజువుగా ఆధార్ పేర్కొన్న 32 డాక్యుమెంట్ ల్లో దేనినైనా స్కాన్ కాపీని అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయండి
మరిన్ని వార్తలు