యూకే వీసా 15 రోజుల్లోనే: బ్రిటిష్ హైకమిషనర్ గుడ్‌న్యూస్‌

19 Oct, 2022 12:27 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయులకు యూకే తీపి కబురు చెప్పింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా 15 రోజుల్లో వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియను మళ్లీ ప్రారంభించనుంది. వీసాల జారీపై  భారీ జాప్యం,  ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

గత సంవత్సరంతో పోల్చితే భారతీయ విద్యార్థుల సంఖ్య 89 శాతం పెరిగిందని భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ (అక్టోబర్ 18) ట్విటర్‌లో వెల్లడించారు. విజిటర్ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపై దృష్టి సారించామని ట్విటర్‌లో షేర్‌ చేసిన ఒక వీడియోద్వారా తెలిపారు. అలాగే  ఐటీ నిపుణుల వర్క్‌ వీసాల ఆలస్యాన్ని నివారించడం తోపాటు, జారీ ప్రక్రియను మరింత వేగంగా ప్రాసెస్ చేయనున్నామన్నారు. ఈ నిర్ణయం ఐటీ నిపుణుల తోపాటు, చాలామంది భారతీయులకు ఊరటనిస్తోంది. దీంతో  పలువురు హర్షం ప్రకటిస్తున్నారు.

15 రోజుల టైమ్‌లైన్ చాలా ఉపశమనం కలిగిస్తుందని ఒక ట్విటర్‌ యూజర్‌ కమెంట్‌ చేశారు.  షార్ట్ టర్మ్ స్టడీ విజిటర్ వీసా కోసం అప్లై  చేసి 9 వారాలు అయినా ఇంకా రాలేదని మరో యూజర్‌ ఫిర్యాదు చేశారు. వీసా రాని కారణంగా యూనివర్సిటీలో ఫిజికల్‌ హాజరు గడువు దాటిపోవడంతో స్టడీని వాయిదా  వేసుకోవాల్సి వచ్చింది.  ఇపుడిక మంచి జరుగుతుందని భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు