సోషల్‌ మీడియా ఫిర్యాదుల పరిష్కారం: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

25 Jun, 2022 10:10 IST|Sakshi

సోషల్‌ మీడియా ఫిర్యాదుల పరిష్కారం సరిగ్గా లేదు : కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌  

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలు ఫిర్యాదులను తగిన విధంగా పరిష్కరించడం లేదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అ న్నారు. ఐటీ నిబంధనలను సవరించే ముసాయిదా నోటిఫికేషన్‌పై భాగస్వాములతో మంత్రి చర్చ నిర్వహించారు. సవరించిన నిబంధనల కింద ప్రభు త్వం గ్రీవెన్స్‌ ప్యానెల్‌ను ప్రతిపాదించడం గమనార్హం. ‘‘గ్రీవెన్స్‌ ఆఫీసర్, జవాబుదారీకి చోటు కలి్పంచాం. 2021 ఫిబ్రవరికి ముందు ఇది లేదు.

సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్‌లు గ్రీవెన్స్‌ ఆఫీసర్లను ని యమిస్తున్నాయి. కానీ, నిజమైన ఫిర్యాదుల పరిష్కారం ఉండడం లేదు. దీన్ని పరిష్కరించాల్సి ఉంది’’అని మంత్రి చెప్పారు. భారత చట్టాల పరిధిలో నిబంధనల ఉల్లంఘనపై వచ్చే ఫిర్యా దులకు సామాజిక మాధ్యమ వేదికలు సరిగ్గా స్పందించాలని సూచించారు. అలాగే, వివక్ష చూపించకూడదని, మాట్లాడే స్వేచ్ఛ, గోప్యత, పౌరుల హక్కులకు వ్యతిరేకంగా పనిచేయరాదని సూచించారు. ప్రభుత్వం ఇటీవలే గ్రీవెన్స్‌ అప్పీలేట్‌ బాడీని ప్రతిపాదించడం తెలిసిందే. యూజర్లు సోషల్‌ మీడియా సంస్థల గ్రీవెన్స్‌ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ అప్పీల్‌ చేసుకోవచ్చు.   
 

మరిన్ని వార్తలు