మరో రెండు దేశాల్లో యూపీఐ సేవలు.. | Sakshi
Sakshi News home page

మరో రెండు దేశాల్లో యూపీఐ సేవలు..

Published Mon, Feb 12 2024 4:43 PM

UPI Services Launched In Sri Lanka And Mauritius - Sakshi

భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సిస్టం.. ఈ రోజు శ్రీలంక, మారిషస్‌లలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వర్చువల్ కార్యక్రమం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్​​ పాల్గొన్నారు.

శ్రీలంక, మారిషస్‌ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న తరుణంలోనే ఇండియాకు చెందిన సేవలు ప్రారంభం కావడం గొప్ప విషయం. ఈ రోజే శ్రీలంకలోని భారతీయుడు తొలి యూపీఐ లావాదేవీలను నిర్వహించారు. యూపీఐ లావాదేవీలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేయాలనే 'నరేంద్ర మోదీ' కల మెల్ల మెల్లగా నెరవేరుతోంది.

ప్రస్తుతం శ్రీలంక, మారిషస్‌లలో UPI సిస్టం అందుబాటులోకి రావడం వల్ల డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మారిషస్‌లో యూపీఐతో పాటు రూపే కార్డ్ సేవలను కూడా ప్రారంభించారు.

ఇప్పుడు శ్రీలంక, మారిషస్‌లలో యూపీఐ లావాదేవీలు ప్రారంభం కావడం వల్ల.. ఇండియా నుంచి వెళ్లే భారతీయులు యూపీఐ లావాదేవాలను జరుపవచ్చు. మారిషస్‌లో రూపే కార్డ్ సేవల పొడిగింపు మారిషస్‌లోని రూపే విధానం ఆధారంగా కార్డులను జారీ చేయడానికి మారిషస్ బ్యాంకులను అనుమతిస్తుంది.

ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

గత కొన్ని రోజులకు ముందు ఫ్రాన్స్ దేశంలో కూడా యూపీఐ పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈఫిల్ టవర్ సందర్శించాలనుకునే వ్యక్తులు ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో యూపీఐ సిస్టం మరిన్ని దేశాల్లో అందుబాటులో ఉండనున్నట్లు జరుగుతున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది.

Advertisement
Advertisement