US Man Sues Facebook For Banning His Account For No Reason - Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌పై కేసు.. రూ. 41 లక్షలు ఫైన్ - లాయర్ దెబ్బకు ఖంగుతిన్న మెటా!

Published Sun, Jun 18 2023 11:06 AM

US Man Sues Facebook For Banning His Account For No Reason - Sakshi

ఆధునిక కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా యాప్స్‌లో చాలామంది కాలం గడిపేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఖాతాదారుని అకౌంట్‌ని సంస్థలు బ్లాక్ చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకుని సరిపెట్టుకుంటాడు. కానీ అమెరికాకు చెందిన ఒక లాయర్ దీని భిన్నంగా అకౌంట్ బ్లాక్ చేసిన కంపెనీ మీద కేసు వేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికాలోని జార్జియాకు చెందిన 'జాసన్ క్రాఫోర్డ్' (Jason Crawford) అనే వ్యక్తి తనకు కలిగిన అంతరాయానికి ఫేస్‌బుక్‌ కంపెనీకే చెమటలు పట్టించాడు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్ యాక్సెస్ చేయడం కుదరకపోవడంతో సంస్థ మీద కేసుపెట్టి కోర్టుకి లాగాడు. అంతటితో ఆగకుండా నష్టపరిహారంగా 50 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 41.11 లక్షలు జరిమానా విధిందెలా చేసాడు.

(ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!)

క్రాఫోర్డ్ అందించిన సమాచారం ప్రకారం.. ఒక రోజు ఉదయం ఫేస్‌బుక్‌ అకౌంట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది లాక్ అయినట్లు, నన్ను బ్యాన్ చేసినట్లు తెలిసింది. దీనికి కారణం చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని తెలిసింది. అలాంటి తప్పు తాను ఎప్పుడూ చేయలేదని చెప్పాడు. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం సంస్థకు ఫిర్యాదు చేయడానికి చాలా సార్లు ప్రయత్నించానని, అయినా ఎటువంటి ప్రయోజనం లేదని వెల్లడించాడు.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్‌ మరొకటి లేదు!)

ఫేస్‌బుక్‌ అకౌంట్ బ్యాన్ కావడాన్ని జీర్ణించుకోలేని క్రాఫోర్డ్ వృత్తి రీత్యా లాయర్ కావడం వల్ల 2022 ఆగష్టులో కంపెనీ మీద కేసు వేసాడు. అయినప్పటికీ ఫేస్‌బుక్ నుంచి సరైన సమాధానం లభించలేదు, దీంతో కోర్టు క్రాఫోర్డ్‌కు 50 వేల డాలర్లు చెల్లించాలని మెటాను ఆదేశించింది. అయితే క్రాఫోర్డ్ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే సంస్థ తన అకౌంట్ రీస్టోర్ చేసింది. కానీ జరిమానా చెల్లించలేదు.

Advertisement
 
Advertisement