Vedanta to invest Rs 14,000 crore in FY24 on growth project - Sakshi
Sakshi News home page

వేదాంతా భారీ పెట్టుబడులు: ఏకంగా రూ. 14,000 కోట్లు

Published Thu, Jun 22 2023 3:40 PM

Vedanta to invest 14000crores infy24 for growth project - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో 1.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 14,000 కోట్లు) పెట్టుబడులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. వివిధ బిజినెస్‌ల సామర్థ్య విస్తరణకు నిధులు వినియోగించనున్నట్లు గతేడాది(2022–23)కి విడుదల చేసిన వార్షిక నివేదికలో కంపెనీ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా గతేడాది ఆస్తులు, ఉత్పత్తిపై 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెచి్చంచినట్లు తెలియజేశారు. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలోనూ వృద్ధికి వీలుగా 1.7 బిలియన్‌ డాలర్లను వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అల్యూమినియం, జింక్‌ ఉత్పత్తి సామర్థ్యాల విస్తరణను చేపట్టినట్లు ప్రస్తావించారు.   (Global Chess League 2023 ఆనంద్‌ VS ఆనంద్‌: మహీంద్ర ట్వీట్‌ వైరల్‌)

చమురు, గ్యాస్‌పై 
ప్రస్తుతం దేశీ ఉత్పత్తిలో నాలుగో వంతు ఆక్రమిస్తున్న చమురు, గ్యాస్‌ కార్యకలాపాల వాటాను 50 శాతానికి చేర్చాలని ప్రణాళికలు వేసినట్లు అనిల్‌ తెలియజేశారు. ఈ బాటలో నిల్వలు(రిజర్వులు), వనరుల(రిసోర్సెస్‌) పోర్ట్‌ఫోలియోను వివిధీకరిస్తున్నట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గతేడాది క్లిష్టమైన, అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణంలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగినట్లు తెలియజేశారు. భౌగోళిక, రాజకీయ వివాదాలు, వీటితో తలెత్తిన ఇంధన సంక్షోభం, కేంద్ర బ్యాంకులు అవలంబించిన కఠిన పరపతి విధానాలు సవాళ్లు విసిరినట్లు వివరించారు. అయినప్పటికీ కంపెనీ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించినట్లు ప్రస్తావించారు. ఆదాయం రూ. 1,45,404 కోట్లను తాకగా.. రూ. 35,241 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించినట్లు పేర్కొన్నారు. రూ. 18,077 కోట్ల నికర ఫ్రీక్యాష్‌ ఫ్లోను సాధించినట్లు తెలియజేశారు.  (ఈ ఫోటో ఎవరిదో గుర్తు పట్టగలరా? టాప్‌ హీరోయిన్‌ అయితే కాదు!)

‘మెయిటీ- నాస్కామ్‌ సీవోఈ’తో వేదాంత గ్రూప్‌ జట్టు  
అంకుర సంస్థలు అభివృద్ధి చేసే కొత్త డిజిటల్‌  టెక్నాలజీలను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపై వేదాంత గ్రూప్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్పార్క్‌ ప్రోగ్రాం కింద కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మెయిటీ)- పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌కి చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ)తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌)/ వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) మొదలైన టెక్నాలజీల ఆధారిత ఆవిష్కరణలను వేదాంత గ్రూప్‌ సంస్థల్లో వినియోగించే అవకాశాలను పరిశీలిస్తారు. దీర్ఘకాలికంగా పర్యావరణ, సామాజిక, ఆరి్థక స్థిరత్వానికి దోహదపడే పరిష్కార మార్గాలను కనుగొనాలన్నది తమ లక్ష్యంగా వేదాంత లిమిటెడ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రియా అగర్వాల్‌ హెబ్బర్‌ తెలిపారు. వేదాంత స్పార్క్‌ ప్రోగ్రాం కింద 80 పైచిలుకు స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.  

Advertisement
Advertisement