Sakshi News home page

విజయా డయాగ్నొస్టిక్స్‌ విస్తరణ ప్రణాళిక

Published Sat, Mar 23 2024 5:36 AM

vijaya diagnostic plans to new branches - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్యపరీక్షల సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్స్‌ ఏటా 8–10 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మొత్తం 140 పైచిలుకు డయాగ్నొస్టిక్‌ సెంటర్స్‌ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. తమ డయాగ్నొస్టిక్‌ కేంద్రంలో ఫ్యూజిఫిల్‌్మకి చెందిన అధునాతన ఓపెన్‌ ఎంఆర్‌ఐ మెషీన్‌ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీవోవో శేషాద్రి వాసన్‌ ఈ విషయాలు తెలిపారు.

క్లోజ్డ్‌గా ఉండే ఎంఆర్‌ఐతో పోలిస్తే ఓపెన్‌గా ఉండే అపెర్టో లూసెంట్‌ మెషీన్‌.. పేషంట్లలో ఆదుర్దాను తగ్గించగలిగేలా ఉంటుందని ఫ్యూజి ఫిల్మ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (హెల్త్‌కేర్‌ విభాగం) చందర్‌ శేఖర్‌ సిబాల్‌ తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లోనూ తయారీ, అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించారు. ఫ్యూజిఫిల్మ్‌ ఇండియా ఎండీ కోజీ వాడా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement