Virat Kohli Adds New Limited Edition Electric Scooter to His Garage - Sakshi
Sakshi News home page

స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ 

Published Mon, Apr 3 2023 5:31 PM

Virat Kohli adds new limited edition electric scooter to his garage check details - Sakshi

 సాక్షి, ముంబై: స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లి  ఐపీఎల్‌లో సరికొత్త ఫీట్‌ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఇది ఐపీఎల్‌లో అతని 50వ 50-ప్లస్ స్కోరుతో  ఆకట్టుకునే ఫీట్‌ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. అయితేఈ లిస్ట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60తో అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49తో ఓవరాల్ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరు మీద 45 అర్ధసెంచరీలు. 5 సెంచరీలు ఉన్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ఆదివారం ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి  విరాట్ కోహ్లీ  ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.దీంతో ఆంపియర్ ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  (NMACC పార్టీలో టిష్యూ పేపర్‌ బదులుగా, రూ.500  నోటా? నిజమా?)

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను  గిప్ట్‌గా అందుకున్నాడు.  బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన కోహ్లి (82 నాట్‌ అవుట్‌)గా నిలిచాడు.  కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్ (73)తో కలిసి 148 ఓపెనింగ్‌ పార్టనర్‌షిప్‌తో శుభారంభం చేసి జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన సంగతి  తెలిసిందే.  దీంతో ఆర్‌సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ కోహ్లీకి అందించింది.  గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్‌ను  కోహ్లికి అందించారు. అయితే, మొత్తంమీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. (Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్‌ న్యూసేనా?)

కాగా ఆర్‌సీబీ ఆడే ప్రతి IPL మ్యాచ్ తర్వాత గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్‌సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 'ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'కి ఆర్‌సీబీ ప్లేయర్‌కు అందజేస్తుంది.  ఆర్‌సీబీకి  అధికారిక  భాగస్వామి  ఆంపియర్. 

మరోవైపు గత వారమే లాంచ్‌ చేసిన ఆంపియర్ ప్రైమస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏప్రిల్ మొదటి వారం నుండి పరిమిత కాలానికి రూ. 499 ప్రీ-బుకింగ్‌లకు అందుబాటులో ఉంటుంది. తమ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ ప్రైమస్ అని సంజయ్‌ వెల్లడించారు.లిమిటెడ్‌ ఎడిషన్ ఆంపియర్ ప్రైమస్ జట్టు స్ఫూర్తిని, క్రీడను, హర్‌ గల్లీని ఎలక్ట్రిక్‌గా మార్చాలనే తమ ఉద్దేశ్యానికి జీవం పోసిందన్నారు. తమకు 1.80 లక్షల మంది వినియోగదారులున్నారని కంపెనీ పేర్కొంది.

Advertisement
Advertisement