పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు! | Sakshi
Sakshi News home page

పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!

Published Thu, Apr 4 2024 10:20 AM

Vistara CEO Meeting With Pilots For Solve Their Problems - Sakshi

పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్‌ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. 

తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది. 

ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..

ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్‌ కన్నన్‌ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement