Sakshi News home page

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త

Published Sat, Oct 15 2022 12:02 PM

This Week's Latest Smartphone, Gadget And Tech News - Sakshi

ఈ వారం టెక్నాలజీ మార్కెట్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు హాట్‌ టాపిగ్గా మారాయి. ముఖ్యంగా యాపిల్‌, శాంసంగ్‌ 5జీకి సపోర్ట్‌ చేసేలా తమ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేస్తాయని ప్రకటించాయి. దీంతో పాటు మెటా సంస్థ తన క్వెస్ట్ ప్రో విఆర్ హెడెసెట్‌ను ఆవిష్కరించింది. హై-ఎండ్ విఆర్ యాక్సెసరీ మార్కెట్లో అడుగు పెడుతున్నట్లు హింట్‌ ఇచ్చింది. వీటితో పాటు మిగిలిన టెక్నాలజీ వార్త విశేషాల గురించి తెలుసుకుందాం. 

40 శాతం డేటా గల్లంతు 
40శాతం పైగా భారతీయ వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో లీకైంది. దేశ ఐటీ వ్యవహారాలపై దృష్టి సారించిన అంతర్జాతీయ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఐఎస్ఎస్‌పీఏ)  మన దేశానికి చెందిన 41 శాతం మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరస్తులు దొంగిలించినట్లు వెల్లడించింది.  

5జీ అప్‌డేట్స్‌ 
దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలైన యాపిల్‌, శాంసంగ్‌తో పాటు ఇతర సంస్థలు 5జీ సపోర్ట్‌ చేసేలా తమ ఫోన్‌లలో ఓవర్-ది- ఎయిర్ సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేస్తామని తెలిపాయి.  

ఉద్యోగులపై వేటు 
ద్రవ్యోల్బణం, సప్లయి అండ్‌ డిమాండ్‌ తగ్గిపోవడంతో టెక్‌ దిగ్గజం ఇంటెల్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 113,000 మంది ఉద్యోగులు ఇంటెల్‌లో పనిచేస్తుండగా.. వారిలో 20 శాతం మంది ఉద్యోగులకు వేటు వేయనున్నట్లు బ్లూం బెర్గ్‌ నివేదించింది. 

వీఆర్‌ హెడ్‌సెట్‌ ఆవిష్కరణ 
సోషల్‌ మీడియా దిగ్గజం మెటా వీఆర్‌ యాక్సెసరీ మార‍్కెట్‌లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన కొత్త క్వెస్ట్ ప్రో విఆర్ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. దీని ధర 1500 డాలర్లు ఉంది. 

ఈ ట్యాక్సీ గాల్లో ఎగురుతుంది 
చైనాకు చెందిన టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్‌ పెంగ్‌ దుబాయ్‌లో తన ఫ్లయింగ్ టాక్సీ మోడల్‌ను పరీక్షించింది. మానవరహిత విమానంపై ట్రయల్స్‌ నిర్వహించిన ఎక్స్‌పెంగ్‌.. గతంలో మానవ సహిత విమానాలను పరీక్షించినట్లు పేర్కొంది.

యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ 
ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ టైప్‌- సీ పోర్టులను మార్కెట్‌లో విడుదల చేయనుంది.ఇందులో భాగంగా 2024 నాటికి ఎయిర్‌ పాడ్స్‌, మ్యాక్ యాక్ససరీస్‌కు సపోర్ట్‌ చేసేలా టైప్-సీ సపోర్ట్ పోర్టులను తయారు చేసి వాటిని అందుబాటులోకి తేనుంది.

Advertisement
Advertisement