ఇక్కడ అందరూ రిచ్‌.. రూ. కోటి సంపాదిస్తారు..! | Sakshi
Sakshi News home page

Richest Countries: ఇక్కడ అందరూ రిచ్‌.. రూ. కోటి సంపాదిస్తారు..!

Published Thu, Feb 8 2024 3:21 PM

Worlds Richest Countries Across 3 Metrics - Sakshi

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఏది అంటే చాలా మంది అమెరికా అని భావిస్తారు. కానీ ఆ దేశం కన్నా ధనిక దేశాలు చాలానే ఉన్నాయి. యూరప్‌లోని లక్సెంబర్గ్‌ దేశం ప్రపంచంలోనే రిచెస్ట్‌ కంట్రీగా ఉంది. ఇక్కడ ప్రతిఒక్కరూ సగటున కోటి రూపాయలు సంపాదిస్తారంటే నమ్ముతారా? ఇలాంటి టాప్‌ సంపన్న దేశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

సాధారణంగా ఒక దేశం ఆర్థిక విజయాన్ని తలసరి జీడీపీ ఆధారంగా అంచనా వేస్తారు. అయితే ఇది వ్యక్తిగత ఆర్థిక శ్రేయస్సును చూపుతుంది. కానీ ఈ ప్రమాణం ద్వారా దేశాలను పోల్చడానికి వీలుండదు. 2022 సంవత్సరంలో తలసరి జీడీపీతోపాటు, ప్రజల కొనుగోలు శక్తి, ఉత్పాదకత ప్రమాణాల ఆధారంగా ‘ది ఎకనామిస్ట్ అండ్‌ సోల్‌స్టాడ్, సోండ్రే’ నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలేవో ఇప్పుడు చూద్దాం..

టాప్‌లో లక్సెంబర్గ్‌
తలసరి జీడీపీ ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో యూరప్‌ దేశమైన లక్సెంబర్గ్‌ టాప్‌లో ఉంది. 2022లో ఈ దేశం తలసరి జీడీపీ 1,26,426 డాలర్లు అంటే భారత్‌ కరెన్సీలో సుమారు రూ. కోటి. దీని ప్రకారం ఇక్కడ సగటున ప్రతిఒక్కరూ కోటి రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట. ఇక కొనుగోలు శక్తిలోనూ ఈ దేశం టాప్‌లో ఉంది. అయితే ఉత్పాదత విషయంలో మాత్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో నార్వే అగ్ర స్థానంలో ఉంది. 

చిన్న దేశాలే మెరుగ్గా..
ఆర్థికంగా చిన్న దేశాలే మెరుగ్గా ఉన్నాయి. మొదటి 10 సంపన్న దేశాలను తీసుకుంటే వాటిలో ఎనిమిది దేశాల్లో జనాభా కోటి కంటే తక్కువే. తలసరి జీడీపీ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన లక్సెంబర్గ్‌లో జనాభా కేవలం 6.60 లక్షలు. దాని అనుకూలమైన పన్ను విధానాల కారణంగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఈ చిన్న దేశం గణనీయమైన సంపద కారణంగా అక్కడి పౌరులు ఉచిత విద్య, వైద్యం, రవాణా సదుపాయాలను ఆనందిస్తున్నారు.

Advertisement
Advertisement