కొత్త ఎడిషన్‌లో యమహా ఎఫ్‌జడ్‌ 25

21 Jul, 2021 01:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తాజాగా భారత్‌లో మాన్‌స్టర్‌ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్‌లో ఎఫ్‌జడ్‌ 25 మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.1,36,800. బీఎస్‌–6 ప్రమాణాలతో 249 సీసీ ఎయిర్‌ కూల్డ్, ఫోర్‌ స్ట్రోక్, సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ను పొందుపరిచారు. పరిమిత సంఖ్యలోనే ఈ మోడల్‌ బైక్స్‌ను విక్రయిస్తారు. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న రేసింగ్‌ వాహనాలను ఇక్కడ పరిచయం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇతర మోడళ్లలోనూ మాన్‌స్టర్‌ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్‌ను తీసుకు రానున్నట్టు యమహా ప్రకటించింది.

మరిన్ని వార్తలు