సంరక్షణ కేంద్రానికి బాలుడి తరలింపు | Sakshi
Sakshi News home page

సంరక్షణ కేంద్రానికి బాలుడి తరలింపు

Published Tue, Mar 21 2023 1:36 AM

 కార్తీక్‌ - Sakshi

చిత్తూరు అర్బన్‌: నగరంలో తప్పిపోయిన ఓ ఆరేళ్ల బాలుడ్ని పోలీసులు సంరక్షణ కేంద్రానికి సోమవారం తరలించారు. వివరాలు.. తల్లిదండ్రులు కనిపించడంలేదని ఓ బాలుడు ఏడుస్తుంటే గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పిల్లాడిని పోలీసులు విచారిస్తే తన పేరు కార్తీక్‌ అని చెబుతూ పాండిచ్చేరి అని ఓసారి.. చిత్తూరు అని మరోసారి చెబుతున్నాడు. బాలుడి వివరాలు తెలిసినవాళ్లు డయల్‌–100, 9440796707 , పోలీసు వాట్సాప్‌–9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని వన్‌టౌన్‌ సీఐ నరసింహరాజు కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement