శ్రీవారి దర్శనానికి 5 గంటలు | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 5 గంటలు

Published Mon, Oct 16 2023 1:08 AM

-

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు 67,785 మంది స్వామివారిని దర్శించుకోగా 21,284 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.2.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 5 గంటల్లో, టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

వేదాలు మానవజాతికి మార్గదర్శకాలు

తిరుమల: మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకాలు పవిత్ర గ్రంథాలు వేదాలు అని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుమలలోని నాద నీరాజన వేదికపై ఆదివారం వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస వేద విద్వత్‌ సదస్సు ప్రారంభోత్సవానికి టీటీడీ చైర్మన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి వేద విజ్ఞానం పరిఢవిల్లుతోందన్నారు. వేద ప్రామాణికంగా నడుచుకుంటే నైతిక విలువలతో కూడిన జీవనం అలవడుతుందని తెలిపారు. ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ వేదాలు బో ధించే ‘పంచా దశ సంస్కారాల’ ప్రాముఖ్యతను వివరించారు. వేదం అజ్ఞానంలో ఉండే మానవుడిని విజ్ఞానం వైపు నడిపించడంతోపాటు సంస్కారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్‌, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, ఎస్వీ ఉన్నత వేద అధ్య యన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్‌ విభీషణ శర్మ పాల్గొన్నారు.

Advertisement
Advertisement