మరింత సహకారం

20 Nov, 2023 00:36 IST|Sakshi
నగరిలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌

చిత్తూరు అగ్రికల్చర్‌: సహకార రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు రైతులు, ప్రజలకు కూడా బహుళ సేవలు అందించేలా కృషి చే స్తోంది. రైతులు, ప్రజలకు మరింతగా చేరువుగా సేవలందించేందుకు వివిధ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో గ్రామీణులకు సైతం బహుళ సేవలు ఆయా సహకార పరపతి కేంద్రాల్లోనే అందనున్నాయి.

జనరిక్‌ ఔషధ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

గ్రామీణ ప్రాంతాల్లోనూ జనరిక్‌ ఔషధ కేంద్రాలను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఆయా గ్రామాల పరిధిలోని సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)ను ఎంపిక చేసింది. ప్రధానమంత్రి జనరిక్‌ ఔషధ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్‌ల్లోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 4 సహకార సంఘాలు, ఒక సహకార మార్కెటింగ్‌ సొసైటీలో మొత్తం 5 ప్ర ధాన మంత్రి జనరిక్‌ ఔషధ కేంద్రాలు ఏర్పాటు కా నున్నాయి. వీటిని పలమనేరు, గంగాధరనెల్లూరు, నగరి, వెదురుకుప్పం పీఏసీఎస్‌లతో పాటు చిత్తూరు లోని సహకార మార్కెటింగ్‌ సొసైటీలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తికాగా, చిత్తూరు, నగరి సంఘాలకు అనుమతి మంజూరు కావాల్సి ఉంది.

కామన్‌ సర్వీస్‌ సెంటర్లు

సహకార పరపతి సంఘాల్లో కామన్‌ సర్వీస్‌ సెంటర్ల(సీఎస్‌సీ) ఏర్పాటుకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో రైతులు, ప్రజలు ఏదై నా సర్టిఫికెట్‌, 1బీ, ఎఫ్‌ఎంబీ, అడంగల్‌, టికెట్స్‌ బుకింగ్‌, ఆధార్‌లో మార్పులు, చేర్పులు, పాన్‌కార్డ్‌ తదితర సేవల కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సివచ్చేది. దీంతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు అ ధిక ధరలు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడేవారు. ఇలాంటి దోపిడీకి చెక్‌ పెడుతూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి పరపతి సంఘంలో కామ న్‌ సర్సీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, 250 ర కాల సేవలు అందిస్తోంది. జిల్లాలో మొత్తం 37 స హకార పర పతి కేంద్రాలు (పీఏసీఎస్‌) ఉండగా, ఇప్పటికే 25 కేంద్రాల్లో కామన్‌ సర్వీస్‌ సెంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. మిగిలిన 12 సంఘాల్లో కూడా త్వరలోనే సీఎస్‌సీలు ఏర్పాటు చేయనుంది.

పెట్రోల్‌ బంకుల నిర్వహణ

ఆర్థికంగా బలోపేతానికి జిల్లా సహకారశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకుల నిర్వహణకు శ్రీకారం చు ట్టింది. జిల్లాలో 5 పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చే సేలా ప్రణాళిక రూపొదించింది. ఇప్పటికే నగరి, బయ్యప్పగారిపల్లె (రొంపిచెర్ల మండలం), పలమనేరులో పెట్రోల్‌ బంకులను నిర్వహి స్తోంది. మరో రెండు పెట్రోల్‌ బంకుల ను సదుం, రామకుప్పంలో ఏర్పాటు చే సేందుకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

సహకార సంఘాల్లో బహుళ సేవలు జిల్లాలో 5 జనరిక్‌ ఔషధ కేంద్రాల

ఏర్పాటుకు సన్నాహాలు

ప్రతి సహకార పరపతి సంఘంలో

కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ సేవలు

ఇప్పటికే 3 పెట్రోల్‌ బంకుల నిర్వహణ

మరో రెండు బంకుల ఏర్పాటుకు చర్యలు

ఇంటి ముంగిటకే

సహకార సేవలు

సహకార రంగ సేవలు గ్రామీణులకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి పీఏసీఎస్‌లో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, 250 రకాల సేవలను ప్రజలకు చేరువ చేశాం. అలాగే జిల్లాలో 5 జనరిక్‌ ఔషధ కేంద్రాల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. వీటిని త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.

– కె.బ్రహ్మానందరెడ్డి,

జిల్లా సహకార శాఖాధికారి

మరిన్ని వార్తలు