ప్రేమ‘ప్రభు’వించెన్‌ | Sakshi
Sakshi News home page

ప్రేమ‘ప్రభు’వించెన్‌

Published Mon, Dec 25 2023 1:46 AM

ప్రత్యేక అలంకరణలో జాన్‌ బాస్కో చర్చి,  చర్చిలో ఏర్పాటు చేసిన ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం  - Sakshi

● చిత్తూరులో చర్చిలు ముస్తాబు ● ప్రత్యేక అలంకరణలో కనువిందు చేస్తున్న మందిరాలు ● ఆకట్టుకుంటున్న పశువుల పాక ● అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు

చిత్తూరు రూరల్‌: జిల్లాలో ఆదివారం క్రిస్మస్‌ సందడి నెలకొంది. చిత్తూరు నగరంలోని జాన్‌ బాస్కో, టౌన్‌ చర్చి, తెలుగు లూక్స్‌, బీటీ మెమోరియల్‌, రీడ్సీపేట చాఫెల్‌, హోసన్నా చర్చిలన్నీ ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. విద్యుత్‌ దీపాలంకరణ, బెలున్‌ డెకరేషన్లతో సుందరమయంగా తీర్చిదిద్దారు. చర్చి ఆవరణలో కొలువుదీరిన పశువుల పాకలు ఆకట్టుకుంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా క్రిస్మస్‌ ఏర్పాట్లును పకడ్బందీగా పూర్తి చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గీతాలపాలనలు, భజనలతో అలరించారు. కాగా క్రిస్మస్‌ను పురస్కరించుకుని చిత్తూరులోని చర్చివీధి, బజారువీధి రద్దీగా కనిపించాయి. వస్త్ర దుకాణాలు కిటకిటలాయి. చర్చి అలంకరణ వస్తువుల అమ్మకం జోరందుకుంది. కేక్‌లు ఆర్డర్లు పుంజుకున్నాయి. రకరకాల కేక్‌లను బేకరీ నిర్వాహకులు అమ్మకానికి పెట్టారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement