సాక్షి, పల్నాడు జిల్లా: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వీధుల్లో, వ్యాపార సముదాయాల్లో, అపార్ట్‌మెంట్‌లలో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
అయితే కొన్ని చోట్ల నిమజ్జనం మహోత్సవంలో పలు అపశ్రుతి, అనుకోని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కరెంట్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. సోమవారం వినాయకుడి ఊరేగింపు చూసేందుకు 13 ఏళ్ల బాలుడు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగిలి బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
చదవండి: తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వేడుకగా చక్రస్నానం