కేరళలో మరో విస్మయ.. పెళ్లైన మూడు నెలలకే

27 Jun, 2021 20:54 IST|Sakshi

కేరళలో కొద్ది రోజుల క్రితం విస్మయ అనే 23 ఏళ్ల మహిళ వరకట్న వేధింపులతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన మరువక ముందే మరో ఘటన రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. తన అత్తమామల వరకట్న వేదింపుల కారణంగా 19 ఏళ్ల యువతి వివాహం చేసుకున్న దాదాపు మూడు నెలల తర్వాత చనిపోయింది. ఆ యువతి తల్లితండ్రులు మాత్రం కట్నం కోసమే ఆమెను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. మృతిరాలి పేరు సుచిత్ర. సుచిత్రకు ఈ ఏడాది మార్చి 21న విష్ణుతో వివాహం జరిగింది. ఇప్పుడు వివాహం జరగకపోతే మరో 7 ఏళ్ల తర్వాతే పెళ్లి జరుగుతుందని ఆమె జాతకంలో ఉన్నట్లు తల్లి, తండ్రులు చెప్పారు.

సుచిత్ర కుటుంబం కట్నం కింద 51 సెవిరీల బంగారం, బైక్ ను కట్నంగా ఇచ్చారు. అయితే, ఇవి ఏమి ఆమె అత్తమామలకు సరిపోలేదు. మహిళ మామ కారు, రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఆమె తండ్రి సునీల్ తన పెన్షన్ వచ్చాక డబ్బు ఇస్తానని ఆమె అత్తమామలకు వాగ్దానం చేశాడు. "అయితే వివాహం జరిగిన వెంటనే వరుడి కుటుంబం మళ్లీ డిమాండ్ చేయడం ప్రారంభించారు. విష్ణు సోదరికి అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పారు". బంగారు ఆభరణాలను లాకర్ లో ఉంచాలని ఆమె అత్తగారు వేధించారని ఆరోపించారు. ఆమె అత్తగారు కొన్ని ఆభరణాలను తనఖా పెట్టారని ఆమె తల్లి తెలిపింది. బంగారం పేరిట ఇంట్లో మరిన్ని సమస్యలు రావడంతో  ఆమెకు బంగారం ఎందుకు ఇచ్చారని అడుగుతూ, ఏడుస్తూ ఒక రోజు నాకు కాల్ చేసినట్లు తల్లి చెప్పింది.

సుచిత్ర భర్త విష్ణు భారతీయ సైనిక దళంలో పనిచేస్తాడు. వివాహం జరిగిన నెలన్నర తర్వాత ఉద్యోగంలో భాగంగా జార్ఖండ్ కు తిరిగి వెళ్లాడు. తన భార్యను తన తల్లితండ్రులతో విడిచి పెట్టి వెళ్లాడు. సుచిత్ర తల్లితండ్రులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తన ప్రాణాలను తీసుకోలేదని ఆరోపించారు. ఆమె తల్లి మీడియాతో మాట్లాడుతూ.. " అసలు ఆమెకు(సుచిత్ర) సరిగ్గా ముడి వేయడం కూడా రాదని, అలాంటి ఆమె ఇలా ఎలా చేయగలదు? అమ్మాయిలు మనుషుల కాదా? ప్రతి ఒక్కరూ అమ్మాయిలతో ఇలా ఎందుకు చేస్తున్నారు. నా కుమార్తె ముందు చాలా భవిష్యత్ ఉంది అని భాదపడింది. ఈ మృతిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్ హెచ్ ఓ) మిథున్ డీ. అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు, కేసు దర్యాప్తు అన్నీ విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.

చదవండి: అయ్యో పాపం.. విస్మయ ఎలా చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు