‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి.. | Sakshi
Sakshi News home page

బెంగళూరు: విషవాయువు పీల్చి టెకీ బలవన్మరణం 

Published Mon, Mar 22 2021 2:15 PM

Bengaluru: Techie Commits Suicide By Sniffing Carbon Monoxide - Sakshi

కృష్ణరాజపురం: ఇప్పటివరకు తానేమీ సాధించలేదని, ఇకపై కూడా ఏమి సాధించలేనని జీవితంపై విరక్తి చెందిన టెకీ యూట్యూబ్‌లో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో బీదర్‌కు చెందిన జీవన్‌ అంబటె (33) బెంగళూరులోని మహదేవపురా.. లక్ష్మీనగర్‌ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నాడు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన అతడు.. అమెజాన్‌ కంపెనీలో టీం లీడర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో తాను జీవితంలో ఏమీ సాధించలేదని తరచూ బాధపడేవాడు. అనంతరం డిప్రెషన్‌కు లోనయి ‘ఎలా మరణించాలి (హౌ టు డై)’ అని యూట్యూబ్‌లో సెర్చ్‌ చేయసాగాడు. 

యూట్యూబ్‌లో వెతికి చివరికి కార్బన్‌ మోనాక్సైడ్‌ గ్యాస్‌ను ఎన్నుకున్నాడు. ఆన్‌లైన్‌లో ప్రయోగాల కోసమని ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నాడు. ముఖాన్ని ప్లాస్టిక్‌ సంచితో కప్పుకున్నాడు. అందులోకి పైప్‌ను పెట్టుకుని వాయువును పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత అతని స్నేహితులు గదికి వచ్చి చూడగా చనిపోయి కనిపించాడు. వెంటనే స్నేహితులు మహదేవపుర పోలీసు స్టేషన్‌లో విషయం తెలియజేశారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నానని, కానీ అవన్నీ నేరవేదని వాపోయాడు. తానో యంత్రంలా మారిపోయానని, ఈ జీవితం తనకు నచ్చలేదని సూసైడ్‌ నోట్‌లో జీవన్‌ పేర్కొన్నాడు. 


డోర్‌కు కాగితం అతికించి..
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జీవన్‌ తాను ఉంటున్న ఇంటి డోర్‌కు స్వయంగా రాసిన కాగితం అతికించాడు. తలుపు ఎలా తెరవాలో బొమ్మ గీశాడు. అంతేకాదు తలుపు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందులో రాశాడు. లోపలికి వచ్చిన తర్వాత కరెంట్‌ స్విచ్‌లు వేయవద్దని.. వేస్తే మంటలు అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. కిటికీలు, తలుపులన్నీ తెరవాలని.. గ్యాస్‌ సిలిండర్‌ వాల్వ్‌ మూసివేయాలని సూచించాడు. డోర్‌కు అతికించిన కాగితంలో తన ఫొటోను కూడా అతడు పెట్టాడు. 

చదవండి:
కర్ణాటకలో బ్లాయిమెయిల్‌: 400 సీడీలున్నాయి!

యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి..

Advertisement
Advertisement