కిడ్నాప్‌ కేసు: ‌అఖిలప్రియ వాడిన సిమ్‌ నంబర్‌ ఇదే..

11 Jan, 2021 16:01 IST|Sakshi

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ముగ్గురు అరెస్ట్‌

అఖిలప్రియ ప్రధాన సూత్రధారి.. 19 మంది పాత్ర ఉంది

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు ముగ్గురుని అరెస్ట్‌ చేడమే కాక.. కీలక ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. ‘మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయను అరెస్ట్ చేశాం. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వాడారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ప్రధాన సూత్రధారి. కిడ్నాప్‌ చేయడానికి ముందు నిందితులు మియాపూర్‌లో ఆరు సిమ్‌ కార్డులు కొన్నారు. కాగా వీటిలో 70956 37583 నంబర్‌ని అఖిలప్రియ వాడారు. మల్లికార్డున్‌రెడ్డి ద్వారా 6 సిమ్‌లు, మొబైల్స్ కొనుగోలు చేశారు. కిడ్నాప్‌నకు ముందు నిందితులు రెక్కి నిర్వహించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది పాత్ర ఉంది’ అని సీపీ తెలిపారు. (చదవండి: అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు)

అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉంది : సీపీ
ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో అఖిలప్రియని అరెస్ట్ చేశాం. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు అన్నివైద్య పరీక్షలు చేయించాం. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిపోర్టుల్లో వచ్చింది. మెడకల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాం అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అఖిలప్రియను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. చంచలగూడ జైలు నుంచి బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై కూపీ లాగనున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు