పెళ్లి రోజు నుంచి ప్రియుడితో వీడియో కాల్‌.. భర్త ఇంట్లోకి వచ్చి చూసేసరికి షాక్‌!

15 Jul, 2023 10:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు: ఇష్టం లేని పెళ్లి చేయడంతో నవ వధువు తన భర్త ఇంటిలోని నగలు తీసుకొని ప్రియుడితో ఉడాయించిం ది. ఈ ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలకా ఉల్లరు–74 గ్రామంలో జరిగింది. కుందాపుర వడేరహోబళికి చెందిన యువతి ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే పెద్దలు ఆమెకు ఉళ్లరుకు చెందిన యువకుడితో ఈ ఏడాది మే 21న వివాహం చేశారు.

పెళ్లి జరిగిన రోజు నుంచి ఆమె ప్రియుడితో వీడియో కాల్‌లో మాట్లాడేది. పద్ధతి మార్చుకోవాలని పుట్టింటివారు, మెట్టింటివారు చెప్పినా పెడచెవిన పెట్టేది. ఈక్రమంలో జూన్‌ 16న భర్త ఇంటికి వచ్చి చూడగా షాక్‌ తిన్నాడు. ఆమెతో పాటు ఇంట్లో ఉన్న రూ.10 లక్షల విలువైన బంగారు అభరణాలు కనిపించలేదు. దీంతో సొమ్మును దోచుకుని ప్రియుడితో వెళ్లిపోయిందని తెలుసుకున్న భర్త.. ఈ ఘటనపై బాధితులు ఈనెల 12న శంకరనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండికన్న కూతురిపై తల్లి కర్కశం.. బిడ్డ గొంతునులిమి, భర్తకి ఫోన్‌ చేసి!

మరిన్ని వార్తలు