కట్నం కోసం భర్త వికృత రూపం.. డ్రగ్స్‌ మత్తులో ఫ్రెండ్స్‌తో కలిసి....

8 Aug, 2022 05:29 IST|Sakshi

సాక్షి, కర్ణాటక: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి అంగరంగ వైభవంగా పెళ్లి, అంతకు మించి కట్న కానుకలు. కానీ వరుని కట్నదాహానికి అంతు లేకుండా పోయింది. ఇంకా తేవాలని సతాయిస్తూ, డ్రగ్స్‌ మత్తులో నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్‌పై బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  ఆ యువతికి– సుదీప్‌కు 2021 లో పెద్దలు పెళ్లి చేశారు. వరుని కుటుంబం డిమాండ్‌ మేరకు వధువు కుటుంబీకులు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవోపేతంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ.55 లక్షల విలువచేసే మినీ కూపర్‌ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్‌కు ముట్టజెప్పారు. కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ.6 కోట్లు అయినట్లు తెలిపింది.  

డ్రగ్స్‌ మత్తులో అరాచకం  
ఇంతటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీల్లో వచ్చే లాభం సుదీప్‌ తీసుకునేవాడు. సుదీప్‌ డ్రగ్స్‌కు బానిస కాగా స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్‌ సేవించి మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన చేసి వికృతంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నిస్తే అసభ్యంగా దూషించేవాడు. ఆమె అత్తమామలకు చెప్పుకోగా వారు కొడుకునే వెనకేసుకొచ్చారు, పైగా నిన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు

మరిన్ని వార్తలు