సికింద్రాబాద్‌లో బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్‌ కంపెనీ, కోట్లు హాంఫట్‌!

28 Aug, 2021 18:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. మారేడుపల్లిలో భవానీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు చిట్టీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పేరుతో ఎర వేసిన శ్రావణ్‌కుమార్‌ అనే వ్యక్తి రూ.30 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు.

బాధితుల్లో వైద్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. వారం రోజులుగా నిర్వాహకుడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో బాధితులు మారేడుపల్లిలోని చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వాహకుడి ఇంటికి వచ్చారు. సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని మారేడ్‌పల్లి పోలీసులు సూచించారు.

ఇవీ చదవండి:
సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్‌: నిన్న షాక్‌.. నేడు ప్రేమపెళ్లి
పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు