ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడి

12 May, 2022 22:49 IST|Sakshi

చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు

పోలీసుల అదుపులో నిందితుడు

చోడవరం: అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై ఒక కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారిని జీడి తోటల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన  సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  వివరాలిలా ఉన్నాయి. జీడి పళ్లు కోద్దాం రమ్మని నమ్మబలికి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన 8 ఏళ్ల వయస్సు గల చిన్నారిని అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం జీడితోటల్లో తీసుకువెళ్లాడు.

ఎవరూ లేని చోట ఆ చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలు  2వ తరగతి చదువుతోంది. ఆ బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు చోడవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ విభూషణరావు దర్యాప్తు ప్రారంభించి పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి  తరలించామని ఎస్‌ఐ తెలిపారు.  బాధితురాలి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వారికి  గ్రామస్తులు  అండగా నిలిచారు.

మరిన్ని వార్తలు