దారుణం: ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌పై అత్యాచారం.. | Sakshi
Sakshi News home page

దారుణం: ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌పై అత్యాచారం..

Published Wed, Feb 10 2021 9:55 PM

Engineering Student Molested By Auto Driver In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్‌ విద్యార్ధినిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడో ఆటో డ్రైవర్. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. సీఎమ్ఆర్‌ కాలేజీకి చెందిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్ధిని సాయంత్రం కాలేజీనుంచి ఇంటికి తిరిగొస్తోంది. జీడిమెట్ల వద్దకు రాగానే కాపు కాసిన ఓ ఆటోడ్రైవర్‌ ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బట్టలు లేకుండా ఉన్న ఆమెను రోడ్డుపైన వదిలేసి వెళ్లాడు. నగ్నంగా ఉన్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని మేడపల్లిలోని క్యూర్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్నారు.

చదవండి : అప్పు.. అక్రమ సంబంధం.. ఓ హత్య

Advertisement
Advertisement