బాలికపై ఏడాదిగా లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో

13 May, 2022 10:39 IST|Sakshi

సాక్షి, దుబ్బాక: బాలికపై ఓ యువకుడు ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్‌కు చెందిన యువకుడు (27) ఇంటర్‌ వరకు చదివి జులాయిగా తిరుగుతున్నాడు. వారి ఇంటి ఎదురుగా ఉండే పదో తరగతి చదువుతున్న బాలిక (15)ను మభ్యపెట్టి ఏడాదిగా అత్యాచారం చేస్తున్నాడు. భయంతో ఆ బాలిక ఇంట్లో ఎవరికీ విషయం చెప్పలేదు. నాలుగు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది.  

కుటుంబ సభ్యులు తూప్రాన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యపరీక్షలు డాక్టర్లు గర్భవతి అని తల్లిదండ్రులకు చెప్పారు. ఆరా తీయగా ఏడాదికి పైగా తనపై ఇంటి ఎదురుగా ఉన్న యువకుడు లైంగికదాడికి పాల్పడుతున్నట్లు బాలిక వివరించింది. దీంతో గ్రామపెద్దల సాయంతో తల్లిదండ్రులు గురువారం బేగంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు