తామరపూలు చూసి మురిసిపోయిన బాలిక.. ప్రాణాలు తీసిన నీటి కుంట

7 Aug, 2021 08:31 IST|Sakshi

సదుం: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండలంలో చోటుచేసుకుంది. కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన గంగాదేవి, రెడ్డెప్ప కుమార్తె మల్లీశ్వరి (11) మండలంలో తుమ్మగుంటపల్లెలోని అమ్మమ్మ కృష్ణమ్మ వద్ద ఉంటోంది. శుక్రవారం ఉదయం కట్టెల కోసం స్నేహితులతో కలిసి వెళ్లి ఆ బాలిక గ్రామ సమీపంలోని గునానికుంటలో ఉన్న తామర పూలను చూసి ముచ్చటపడింది.

వాటిని కోసేందుకు కుంటలోకి దిగింది. పూలవద్దకు వెళ్తూ కుంట లోతుగా ఉండడంతో మునిగిపోయింది. స్నేహితులు ఇది చూసి గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని గాలించారు. అప్పటి మల్లీశ్వరి మృతి చెందింది. మృతదేహాన్ని వెలికితీశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు