Sakshi News home page

Hyderabad : జిమ్‌ ట్రైనర్‌ నిర్వాకం.. ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వస్తే అసభ్య ప్రవర్తన.. ఫోటోలు మార్ఫింగ్‌ చేసి

Published Fri, Jan 13 2023 3:22 PM

Gym Trainer harassed Minor misbehave With Her At Bowenpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వచ్చిన మైనర్ బాలికపై ట్రైనర్ అసభ్యంగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడిన ఘటన బోయిన్‌పల్లి పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు. ఫిట్‌నెస్‌ అర్ జోన్ జిమ్ ట్రైనర్ రాజు అక్కడికి వచ్చిన మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయంతో వర్కవుట్స్ చేస్తుండగా ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఫోటోలు తీసుకున్నాడు. అంతంటితో ఆగకుండా ఆమె శరీర భాగాలను తాకుతూ ఫోటోలు తీసుకున్నాడు.

అయితే బాలికతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వాటన్నింటినీ ఆమె ఫోన్‌కు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతా అంటూ బెదిరించి నగదు డిమాండ్ చేశాడు. దాంతో మైనర్ బాలిక 20 తులాల బంగారం, రూ.4 లక్షల నగదును అప్పప్పింది. కానీ రాజు ఇంకా డబ్బలు కావాలని వేధించడంతో వేధింపులు తాళలేక బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జిమ్ ట్రైనర్ రాజును అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
Advertisement