మంచి జీవితం ఇస్తా!.. మైనర్‌ బాలిక కిడ్నాప్‌, సహజీవనం

28 Apr, 2021 11:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇస్తానని నమ్మించి మోసం

సాక్షి, హైదరాబాద్‌: మైనర్‌ బాలికను అపహరించుకుపోయి సహజీవనం చేస్తున్న ఓ యువకుడిపై కిడ్నాప్‌, రేప్‌ కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ మైనర్‌ బాలిక కుటుంబం చాలా కాలం క్రితం నగరానికి వలస వచ్చి మల్లాపూర్‌లో నివాసం ఉంటుంది. మైనర్‌ బాలిక గత ఫిబ్రవరి 2న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూతురు అదృశ్యంపై కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు జరిపి పంజాబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మైనర్‌ బాలికతోపాటుగా సోను కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పంజాబ్‌కు చెందిన సోనుకుమార్‌ ఠాగూర్‌(19) లాక్‌డౌన్‌ సమయంలో బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కూలీ పనిచేసుకుంటూ అదే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఈ క్రమంలో వారికి ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇస్తానంటూ నమ్మించిన సోనుకుమార్‌ మైనర్‌ బాలికను పంజాబ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వివాహం చేసుకొని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు