బంజారాహిల్స్‌: బ్యూటీ అండ్‌ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్‌

31 Aug, 2021 09:08 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, బంజారాహిల్స్‌: సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న స్పాలపై బంజారాహిల్స్‌ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఫిలింనగర్‌లోని కిమ్‌ బ్యూటీ అండ్‌ స్పాపై దాడులు నిర్వహించి ఓనర్‌ కిమ్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోగా ప్రొఫెషనల్‌ థెరపిస్ట్‌ కూడా లేడని ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా కొనసాగుతోందని.. మసాజ్‌ కోసం సెక్స్‌ వర్కర్‌ను నియమించుకున్నట్లు గుర్తించారు. కిమ్‌తో పాటు కొడుకు కాంతిలాల్‌పై కేసు నమోదు చేశారు. కిమ్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.  

వ్యభిచార గృహంపై.. 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 10లోని గౌరీశంకర్‌ కాలనీలో వీ.ఎన్‌. బ్యూటీ స్టూడియో ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఎస్‌ఐ డి.అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి వ్యభిచార గృహ నిర్వాహకుడు ఎ. వేణుగోపాల్, స్పా మేనేజర్‌ ఎన్‌.రాకేష్‌, ఎ.సురేందర్‌రాజులపై కేసు నమోదు చేశారు. ఇక్కడ నలుగురు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకొని బాలిక సంరక్షణా కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సెక్స్‌ వర్కర్లను తీసుకొస్తూ ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: వీడు గజదొంగ గంగన్నా!.. పోలీసులకే కాల్‌ చేసి సవాల్‌?  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు