మైక్రో ఫైనాన్స్ యాప్స్‌ గుట్టురట్టు.. | Sakshi
Sakshi News home page

మైక్రో ఫైనాన్స్ యాప్స్‌ గుట్టురట్టు..

Published Mon, Dec 21 2020 7:34 PM

Hyderabad CCS Police Raids On Micro Finance Apps Call Centers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసులు.. మైక్రో ఫైనాన్స్ యాప్స్‌ గుట్టురట్టు చేశారు. దేశవ్యాప్తంగా మూడు చోట్ల హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని గుర్గావ్ కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ యాప్స్ నడుస్తున్నాయి. ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో రెండు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. మూడు చోట్ల మైక్రో ఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్లను గుర్తించారు. (చదవండి: ఆ యాప్‌ల ద్వారా రుణాలొద్దు: డీజీపీ)

ఢిల్లీలో 400, హైదరాబాద్‌లో 700 మంది కాల్ సెంటర్ల ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ యాప్స్‌ వెనకాల చైనా కంపెనీలు ఉన్నట్లు తెలిసింది. బేగంపేటలోని మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. పంజాగుట్టలోని మరో కాల్‌సెంటర్‌లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్గావ్ కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ వేధింపులు సాగుతున్నాయి. (చదవండి: సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు..)

Advertisement
Advertisement