అరేయ్‌ ఏంట్రా ఇది! బట్టలిప్పి మరీ నగ్నంగా చోరీ, హైదరాబాద్‌లో ఘటన

13 May, 2022 20:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దొంగతనంలోనూ తనకో స్టయిల్‌ ఉందని నిరూపించుకున్నాడు ఓ చోరుడు. నగరంలోని సనత్ నగర్‌లో తాజాగా ఓ విచిత్రమైన చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న దుకాణంలోకి దూరిన ఓ దొంగ.. బట్టలు విప్పేసి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి. 

సనత్ నగర్‌లో బస్టాండ్ ఆనుకుని ప్రధాన రహదారిపై ఉన్న ఓ మెడికల్ స్టార్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తున్న క్రమంలో.. ఆ ఆగంతకుడు దుస్తులు విప్పి లోపలికి ప్రవేశించాడు. సుమారు రెండు గంటల పాటు నగ్నంగానే అందులో ఉన్నాడు. అటు ఇటు కలియతిరిగి.. డ్రాలో ఉన్న డబ్బును బయటకు తీశాడు. తిరిగి బయటకు వచ్చే క్రమంలో దుస్తులు వేసుకుని దర్జా నడుకుంటూ వెళ్లిపోయాడు.

ఉదయం మెడికల్‌ షాప్‌ తెరిచేందుకు వచ్చిన నిర్వాహకుడు.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు. చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు